ETV Bharat / state

హుస్నాబాద్ లో ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం - హుస్నాబాద్ లో జెండా ఎగురవేసిన జిల్లా ఉపాధ్యక్షుడు రేవంత్ కుమార్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను పాటిస్తున్నాయని, వాటిని తిప్పికొట్టడానికి ఉద్యమం ఉద్ధృతం చేస్తామని సిద్ధిపేట జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు రేవంత్ కుమార్ అన్నారు. సీఐటీయూ 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని సిద్ధిపేట జిల్లాలో ఘనంగా నిర్వహించారు.

CITU celebrated its 50th anniversary in Siddipet district.
హుస్నాబాద్ లో ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
author img

By

Published : May 30, 2020, 7:19 PM IST

కార్మికుల హక్కులు, వాటి పరిరక్షణ కోసం ఏర్పడిన సీఐటీయూ 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని.. సిద్ధిపేట జిల్లాలో ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ లో జిల్లా ఉపాధ్యక్షుడు రేవంత్ కుమార్ జెండా ఎగురవేశాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తున్న సమయంలో.. 1970వ సంవత్సరం సీఐటీయూ కార్మిక సంఘం ఏర్పడిందని రేవంత్ కుమార్ తెలిపారు.

కార్మికుల శ్రమ దోచుకుంటున్నారు..

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేకంగా విధానాలను పాటిస్తున్నాయని, వాటిని తిప్పికొట్టడానికి ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామన్నారు. వెట్టిచాకిరీ చేయించుకుంటూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని రేవంత్ కుమార్ ఆరోపించారు. లాక్ డౌన్ నేపథ్యంలో..ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కార్మికులను ఆదుకోకుండా.. ఉద్యోగాల నుంచి తొలగించటం పట్ల మండిపడ్డారు. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: ఒకే ఇంట్లో నలుగురికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.