ETV Bharat / state

ఇళ్లు కూలిపోయిన కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లు కూలిపోయిన నిరుపేద కుటుంబాలకు ముత్యంరెడ్డి కిసాన్ సేవా సమితి అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిత్యావసరాలు, బియ్యం పంపిణీ చేశారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చిన తాను అండగా ఉంటానన్నారు.

author img

By

Published : Aug 26, 2020, 4:17 PM IST

cheruku srinivas reddy helped to poor people in siddipet district
ఇళ్లు కూలిపోయిన కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేట, చందాపూర్, ఘణపురం, గుడికందుల, బండారుపల్లి, పెద్దమాసాన్ పల్లి, తొగుట, పల్లెపహాడ్ గ్రామాల్లో ముత్యంరెడ్డి కిసాన్​ సేవా సమితి అధ్యక్షులు చెరుకు శ్రీనివాస్​రెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు ఆయన బియ్యం, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి హయాంలోనే దుబ్బాక నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని శ్రీనివాస్​రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు, తెరాస కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తాను ముందుంటానన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు ముత్యంరెడ్డి అభిమానులు, తెరాస కార్యకర్తలు, ముత్యంరెడ్డి కిసాన్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'ఆర్థిక న్యాయం సరిపోదు... వారి ప్రాణ త్యాగానికి అర్థం ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.