దుబ్బాక ఉప ఎన్నికలో చపాతి రోలర్ గుర్తుకు 3,570 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన పార్టీలైన భాజపా, తెరాస, కాంగ్రెస్ తరువాత అత్యధిక ఓట్లు ఈ గుర్తుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజు సాధించడం విశేషం. చపాతీ రోలర్, కారును పోలి ఉండటం వల్లే ఆ అభ్యర్థికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఎన్నికలో శ్రమజీవి పార్టీ తరఫున బరిలో నిలిచిన జాజుల భాస్కర్‌కు 1,991, స్వతంత్ర అభ్యర్థులు కంటె సాయన్న-1,709, శ్యాంకుమార్-1,442, లక్ష్మణ్‌రావు-1,221, మోతె నరేశ్‌కు 1006 ఓట్లు పోలయ్యాయి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పోటీ చేసిన ఎస్.అశోక్‌కు అతి తక్కువగా 97 ఓట్లు వచ్చాయి.
ఇదీ చదవండి:భాజపా గెలుపుతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన..