Mohammed Shami Faces Injury Scare : టెస్టుల్లో మళ్లీ టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న పేసర్ మహ్మద్ షమీని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న షమీ మరోసారి గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బంగాల్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ, మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేసేటప్పుడు తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు.
గ్రౌండ్‌లోనే కూర్చుండిపోయిన షమీ! - చివరి ఓవర్‌లో 22 పరుగులను కాపాడుకోవాల్సిన సమయంలో బౌలింగ్‌కు వచ్చిన షమీ నడుము కింది భాగంలో నొప్పితో విలవిల్లాడిపోయాడు. మైదానంలోనే కూర్చుండియాడు. దీంతో బంగాల్ క్యాంప్‌లో ఆందోళన నెలకొంది. గాయం తీవ్రతపై అనుమానం రాగా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మెడికల్ ప్యానెల్ హెడ్ నితిన్ పటేల్ వెంటనే స్పందించి షమీని పరీక్షించాడు. షమీకి ఎలాంటి గాయం కాలేదని, బాగానే ఉన్నాడని చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
అసీస్ టూర్‌కు కష్టమే! - మూడో టెస్టు నాటికి ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే ఆసీస్ పర్యటనకు షమీకి అవకాశం ఇస్తామని ఇప్పటికే మేనేజ్‌మెంట్ షరతు పెట్టింది. ఇప్పుడు, షమీ మళ్లీ గాయపడినట్లు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ షమీ గాయపడితే బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అతడు ఆడడం దాదాపు కష్టమే.
ఏడాదిగా ఆటకు దూరం - వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ ఏడాదిపాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. నెమ్మదిగా గాయం నుంచి కోలుకున్నాడు. బంగాల్ తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడి ఫామ్‌తో పాటు ఫిట్‌నెస్ నిరూపించుకొనేందుకు ప్రయత్నించాడు. బౌలింగ్ పరంగా ఫర్వాలేకపోయినప్పటికీ మోకాలిలో వాపు వచ్చినట్లు తేలింది. మరోవైపు, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో షమీ విషయంలో బీసీసీఐ రిస్క్ తీసుకోవడం లేదు. అతడు 100శాతం ఫిట్‌నెస్ సాధిస్తేనే అతడిని టీమ్ ఇండియా తరఫున ఆడించాలని యోచిస్తోంది.
మధ్యప్రదేశ్ విన్ - సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగాల్, మధ్యప్రదేశ్ జట్లు శుక్రవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగాల్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో మధ్యప్రదేశ్ సక్సెస్ అయ్యింది. 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సుభాన్షు సేనాపతి, పాటిదార్ అర్థశతకాలతో రాణించారు. ఈ మ్యాచ్ లో బంగాల్ స్టార్ పేసర్ షమీ 4 ఓవర్లు వేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ తీయలేదు.
ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ - రెండో టెస్టుకు కీలక పేసర్ దూరం!
భారత్, పాక్ మ్యాచ్ జట్టులోకి 13 ఏళ్ల IPL బాయ్ - ఈ ఆసక్తి పోరు ఫ్రీగా ఎలా చూడాలంటే?