ప్రస్తుతం దేశం గందరగోళ పరిస్థితిలో ఉందని సీపీఐ రాష్ట్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలో అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన చాడా.... కేంద్ర, ప్రభుత్వాలపై మండిపడ్డారు. నల్ల డబ్బు విషయంలో మోదీ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికలలో ఈవీఎంల తప్పిదాలు ఉన్నాయని ఆరోపించారు. పోలైన ఓట్లు తక్కువ... లెక్కింపు ఓట్లు ఎక్కువ వచ్చారని వివరించారు. మోదీ ప్రభుత్వంలో కార్పొరేట్ సంస్థల ఆస్తులు కోట్లకు పెరిగాయని... అవినీతి అంతం చేయడానికి యువత ముందుకు రావాలని వెంకట్రెడ్డి కోరారు.
ఇవీ చూడండి: ఇందూరులో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం