ETV Bharat / state

ప్రజాధనం దుర్వినియోగం చేయడం న్యాయమా?: భాజపా - ప్రజాధనం దుర్వినియోగం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వెంటనే నిర్ణయం ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రజాధనం దుర్వినియోగం అవసరమా?: భాజపా
author img

By

Published : Jul 8, 2019, 4:54 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని అంబేద్కర్ చౌరస్తాలో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నూతన సచివాలయ నిర్మాణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్రమంజిల్​లో ఉన్న చారిత్రక కట్టడాలను కాపాడాలని కోరారు. ప్రస్తుత సచివాలయ భవనాలు పూర్తిగా నాణ్యతతో ఉన్నాయని వాస్తు పేరుతో వాటిని కూల్చివేయటం అనాగరికమని వెల్లడించారు. వేల కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని సీఎంను ప్రశ్నించారు.

ప్రజాధనం దుర్వినియోగం చేయడం న్యాయమా?: భాజపా

ఇవీచూడండి: 'అమిత్ షా వీధి పోరాటాలు తెలంగాణకు ఏమొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.