ధాన్యం నుంచి రైస్ మిల్లర్లు ఎక్కువగా తరుగు తీస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల, పట్టణ భాజపా నేతలు ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హుస్నాబాద్ తహసీల్దార్‌కు వారు వినతిపత్రం సమర్పించారు.
టార్పాలిన్ కవర్లు లేనందున వర్షాలు కురిసినపుడు ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్నారని వారు తెలిపారు. రైతులకు టార్పాలిన్ కవర్లు అందజేయాలని... రైస్ మిల్లుల యజమానులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:- ఐరోపాలో శాంతిస్తున్న కరోనా.. ఫ్రాన్స్‌లో తగ్గిన మరణాలు