ETV Bharat / state

నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోండి: రఘునందన్​ రావు

Raghunandan rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ పర్యటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Apr 1, 2022, 3:51 PM IST

Updated : Apr 1, 2022, 7:17 PM IST

Raghunandan rao: తనపై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్​ రావు కోరారు. హైదరాబాద్​లో డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి ఆయన పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమానికి పోలీసులు భద్రత కల్పించలేదని డీజీపీకి వివరించారు. ఈ సంఘటనపై విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారని.. ఒకవేళ వారిపై చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు.

పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు: తన నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న తనపై భౌతికదాడికి యత్నిస్తే పోలీసులు అడ్డుకోలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ విద్రోహ శక్తులు తనపై కుట్ర పన్ని దాడికి యత్నిస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడమే కాకుండా వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. తాను ఫోన్ చేసి చెప్పినా కూడా సిద్దిపేట ఏసీపీ రక్షణ కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని గుడికందుల మార్కెట్ ప్రారంభోత్సవానికి వెళ్తే తెరాస కండువాలు వేసుకుని వచ్చి అడ్డుకున్నారని మండిపడ్డారు. తెరాస నేతలు తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. మహిళలు వారిపై తిరుగుబాటు చేశారని వెల్లడించారు.

Raghunandan rao
రఘునందన్ రావు

పోలీసులు ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారు?: తెరాస సమావేశాల్లో ఇతర పార్టీ నేతలు ఆందోళన చేస్తే పోలీసులు ఊరుకుంటారా రఘునందన్ రావు ప్రశ్నించారు. తెరాసకు, ఇతర పార్టీలకు ఒక న్యాయమా అని నిలదీశారు. ఎమ్మెల్యే వస్తున్నాడని పోలీసులకు తెలిసినా కూడా బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. మేము మిరుదొడ్డి పోలీసు స్టేషన్​లో ఉంటే.. గేటు బయట తెరాస నేతలతో సిద్దిపేట ఏసీపీ సంప్రదింపులు జరిపారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేని పోలీసులు.. కూల్చేసిన శిలాఫలకం కడుతుంటే 50 మందితో భద్రత కల్పించారని దుయ్యబట్టారు. శిలాఫలకం కూల్చిన వ్యక్తులను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో సిద్దిపేట ఏసీపీ చెప్పాలని ప్రశ్నించారు. శిలాఫలకం కూల్చిన, నాపై దాడికి యత్నించిన వారిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తనపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెరాస కండువాలు వేసుకొని వచ్చి నాపైనే దాడికి దిగుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. శిలాఫలకం పడగొట్టిన వారిని మీరెందుకు అరెస్ట్ చేయలేదు. తెరాస నాయకులు చేస్తున్న దాడులపై మీరు మౌనం వహిస్తే నా భద్రతను ప్రజలే చూసుకుంటారు. జరిగిన దాడుల్నీ డీజీపీ ఖండించాలి. ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా తప్పు చేసినవారిని పోలీసులు శిక్షించాలి. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణం. తెరాస నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదో సిద్దిపేట ఏసీపీ సమాధానం చెప్పాలి.

- రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే

భాజపా కార్యాలయంలో మాట్లాడుతున్న రఘునందన్ రావు

ఇవీ చూడండి:

Etela on CM KCR: 'మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే పదవి నుంచి తప్పుకోవాలి'

Last Updated : Apr 1, 2022, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.