ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్​ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి - కొండపోచమ్మ జలాశయం ప్రారంభానికి ఏర్పాట్లు

కొండపోచమ్మ సాగర్​ రిజర్వాయర్​ ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ హాజరవుతున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మంత్రి హరీశ్​ రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

arrangments complete for cm kcr tour for kondapochamma sagar reservoir opening
హరీశ్​ పర్యవేక్షణలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు
author img

By

Published : May 28, 2020, 11:59 PM IST

సిద్దిపేట జిల్లా మర్కూక్​ మండలంలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్​ జలాశయం ప్రారంభానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​, చిన్నజీయర్​ స్వామితో కలిసి ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. 1200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మంత్రి హరీశ్​ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ముందుగా జగదేవపూర్ మండలంలో ఉన్న కొండపోచమ్మ ఆలయం వద్ద చండీహోమం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. ఎర్రవల్లి నుంచి మార్కూక్​ చేరుకుని మెుదటగా రైతు వేదికకు శంకుస్థాపన చేస్తారు. పంప్​హౌస్ వద్ద సుదర్శన యాగంలో త్రిదండి చిన్న జీయర్ స్వామితో పాటు కలిసి పాల్గొంటారు. అనంతరం జలాశయం కట్ట పైకి వెళ్లి గోదావరికి జలహారతి ఇస్తారు. తర్వాత వరదరాజపూర్​లోని వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

ఇదీ చూడండి: కేటీఆర్​కు అరుదైన గౌరవం.. వర్చువల్ సదస్సుకు ఆహ్వానం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.