సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచడాన్ని స్వాగతిస్తూ డీఎం రమేష్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చారు. సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం గ్యారేజీ ఎదుట కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి అంటూ సంబురాల్లో మునిగిపోయారు.
- ఇదీ చూడండి: షెడ్యూలు విడుదలైనా.. రిజర్వేషన్లపై లేని స్పష్టత