ETV Bharat / state

బకాయిలు చెల్లించాలని పరిశ్రమ ముందు కార్మికుల ధర్నా - sangareddy district news

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో అను లాబొరేటరీ నుంచి న్యాయంగా తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కార్మికులు పరిశ్రమ ముందు ధర్నా నిర్వహించారు. ఇప్పటి వరకూ తమకు చెల్లింపులు చేయలేదని కార్మికులు ఆందోళన చేశారు.

Workers protested in front of industry to pay arrears in sangareddy district
బకాయిలు చెల్లించాలని పరిశ్రమ ముందు కార్మికుల ధర్నా
author img

By

Published : Aug 30, 2020, 8:28 PM IST

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామివాడలో ఉన్న నిత్య లాబొ‌రేటరీ అను లాబొరేటరీగా మారిందని... చాలా కాలం ఇందులో పనిచేసినా తమకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా బయటకు నెట్టేశారని కార్మికులు ఆరోపించారు. ఇప్పటి వరకూ తమకు చెల్లింపులు చేయలేదని కార్మికులు పరిశ్రమ ముందు ఆందోళన చేశారు. గతంలో వంద మంది కార్మికులకు చెక్కులు ఇచ్చినా... చెల్లింపులు జరపలేదని కార్మికులు ఆరోపించారు.

ప్రస్తుతం బ్యాంకు స్వాధీనం చేసుకుకుని వేరే పరిశ్రమకు అప్పజెప్పడం జరిగిందని తెలిపారు. ఎవరు నడుపుకున్నా తమకు అభ్యంతరం లేదని... తమకు న్యాయంగా చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని బకాయిలు చెల్లించాలని పాశమైలారం ఉపసర్పంచ్​ కృష్ణ డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: బహుజన వీరుడు సర్వాయి పాపన్న: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.