ETV Bharat / state

రహదారి పక్కనే శిశువుకు జన్మనిచ్చిన మహిళ.. అట్టపెట్టెలు అడ్డుపెట్టిన స్థానికులు - Woman Gave Birth To Baby by side National Highway

Woman Gave Birth To Baby by side of National Highway: పాపం నిండు గర్భిణి.. త్వరలోనే డెలివరి.. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంది ఆమె. రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళుతుంది.. ఇంతలోనే ఉన్నట్టుండి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆనొప్పులు భరించలేక ఆమె జాతీయ రహదారి పక్కనే కూర్చుండి పోయింది.. స్థానికులు గమనించి ఇంకా ఈ భూమి మీద మానవత్వం ఉందని నిరూపించారు. ఆ తరవాత ఏం జరిగింది?

Woman Gave Birth To Baby by side of National Highway
జాతీయ రహదారి పక్కనే శిశువు జన్మనిచ్చిన మహిళ
author img

By

Published : Dec 24, 2022, 9:52 PM IST

Woman Gave Birth To Baby by side of National Highway: జాతీయ రహదారి పక్కనే ఓ మహిళ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం వద్ద అశోక్​నగర్​ జాతీయ రహదారిపై జరిగింది. పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​ ప్రాంతానికి చెందిన బబిత నిండు గర్భిణి. మధ్యాహ్నం నడుచుకుంటూ వెళ్తుండగా పురిటి నొప్పులు రావడంతో రామచంద్రాపురం అశోక్​నగర్​ కూడలి వద్ద రోదిస్తూ రోడ్డుపైనే కూర్చుండిపోయింది.

పురిటినొప్పులతో విలవిల్లాడుతున్న ఆమెను గమనించిన స్థానికులు సమీపంలో ఉన్న దుకాణాల నుంచి అట్ట పెట్టెలను తెచ్చి అడ్డుగా పెట్టారు. కాసేపటికి ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత ఆమెను ఆటోలో పటాన్​చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె దయనీయ స్థితిని చూసి చలించిన ఓ వ్యక్తి కొంతమేర ఆర్థిక సాయం చేశారు. ఇది ఇలా ఉండగా ఆమె రహదారిపై ప్రసవించడంతో రహదారిపై వెళ్లేవారు వీడియోలు తీయడంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.

రోడ్డు పక్కనే శిశువు జన్మనిచ్చిన మహిళ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.