భూగర్భజలాలు అడుగంటిన వేళ గ్రామ తాగునీటి అవసరాల కోసం తవ్విన బోరు బావినుంచి జలం ఉప్పొంగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తడం వల్ల పంచాయతీ నిధులతో చోటే పీర్ దర్గా పరిసరాల్లో శుక్రవారం రాత్రి బోరుబావి తవ్వించారు. 360 అడుగులు లోతుకు వెళ్లగానే ఒక్కసారిగా నీళ్లు ఉబికి వచ్చాయి.
ఐదు నుంచి ఆరు ఇంచుల మేర నీళ్లు పడడం వల్ల గ్రామస్థులకు తాగు నీటి అవసరాలకు ఢోకా లేదని స్థానికులు సంబరపడుతున్నారు. బోరుబావుల తవ్వకంపై ప్రభుత్వం నిషేధం విధించిన స్థానికుల విజ్ఞప్తుల మేరకు సర్పంచి ప్రత్యేక చొరవ చూపి బోరు వేయగా పుష్కలంగా నీళ్లు పడడం వల్ల గ్రామస్థులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఇవీ చూడండి: అక్రమ వసూళ్లు.. అవినీతి 'రహదారి'..!