ప్లాస్టిక్ కాలుష్య నివారణకు సంగారెడ్డి జిల్లా యంత్రాంగం విన్నూత్న కార్యక్రమం చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ కవర్లు, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను సేకరించి సిమెంట్ పరిశ్రమకు తరలించారు. గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిశ్రమలకు తరలించే వ్యర్థాల వాహనాలను కలెక్టర్ హన్మంతరావు జెండా ఊపి ప్రారంభించారు. వాతవరణ కాలుష్యం, అనారోగ్యానికి కారణం అవుతున్న ప్లాస్టిక్‌ను నిర్మూలించి... చేతి సంచులు వాడాలని ఆయన ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి