సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారు బాహ్యవలయ రహదారి సమీపంలోని పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. మొదటి రోజు రోడ్లపైకి వస్తే అవగాహన కల్పించామని.. అయినప్పటికి కొందరు అనవసరంగా వస్తున్నారని పోలీసులు తెలిపారు.
కొవిడ్ కట్టడికోసం ప్రతి ఒక్కరు సహకరించాలని అనవసరంగా రోడ్లపైకి రావొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి జరిమానా విధించగా... మరికొందరి వాహనాలు సీజ్ చేశారు.
ఇదీ చూడండి: నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సిలింగ్, జరిమానా