సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామంలో సయ్యద్ నజఫీ దర్గాలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి. సర్పంచ్ ఫహీం ఆధ్వర్యంలో 536వ వేడుకలను నిర్వహించారు. మొదటి రోజు గంధం, ఊరేగింపు, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించామని సర్పంచ్ తెలిపారు. రెండో రోజు దీపాల కార్యక్రమం, కవాలి కార్యక్రమాలు జరుపుతామని పేర్కొన్నారు. చివరి రోజు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు.
ఏటా ఈ ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తామని... ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ ఇక్కడికి వస్తారని అన్నారు. భక్తులు తమ కోరికలు కోరుకొని దీపాలు వెలిగిస్తారని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారని చెప్పారు. ప్రతీ ఆదివారం మొక్కుబడులు తీర్చుకోవడానికి వస్తారన్నారు.
ఇదీ చదవండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన: శ్రీలత దీనగాథపై స్పందించిన దాతలు