సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ డిఫెన్స్ కాలనీలో గంజాయి విక్రయిస్తున్నారని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందింది. దానితో సీఐ వేణుకుమార్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వారు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన అరవింద్ ముఖియా, ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడకి చెందిన సనసాయిధన అనే ఇద్దరు యువకులు పట్టుబడ్డారు.
వీరిని విచారించగా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలో నివాసముంటూ కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 150 గ్రాముల ఎండు గంజాయి, ఒక ద్విచక్ర వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు అబ్కారీ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్