ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల నాయకులు సంగారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. యాజమాన్యానికి, సీఎం కేసీఆర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : మద్యం ఎర వేసి.. నిలువు దోపిడీ చేసే గ్యాంగ్