ETV Bharat / state

సూర్య గ్రహణం కారణంగా మూతపడిన దేవాలయాలు - సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు వార్తలు

ఆదివారం సూర్య గ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గంలో ప్రసిద్ధ దేవాలయాలు ముందుగానే మూసేసి.. గ్రహణం అనంతరం సంప్రోక్షణ చేసి తెరవనున్నారు.

temples to be closed due to solar eclipse on sunday
సూర్య గ్రహణం కారణంగా మూతపడనున్న దేవాలయాలు
author img

By

Published : Jun 20, 2020, 6:09 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో ఉన్న సుప్రసిద్ధ గణేష్ దేవాలయాన్ని.. ఆదివారం ఏర్పడనున్న సూర్యగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకు దేవాలయాన్ని మూసివేశామని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం దేవాలయం తెరవమని మళ్లీ సోమవారమే సంప్రోక్షణ చేశాక భక్తులు దర్శనానికి అనుమతిస్తామని కమిటీ నిర్వాహకులు తెలిపారు.

అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని ఆదివారం ఉదయం తెరవబోమని.. గ్రహణం ముగిశాక సాయంత్రం ఐదు గంటలకు దేవాలయంలో సంప్రోక్షణ నిర్వహించి తెరుస్తామని దేవాలయ ఈవో వేణుగోపాల్ తెలిపారు.

గుమ్మడిదల మండలం బొంతపల్లిలో ఉన్న వీరభద్ర స్వామి ఆలయాన్ని శనివారం సాయంత్రం 6 గంటలకు మూసివేశామని తిరిగి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత సంప్రోక్షణ నిర్వహించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామని దేవాలయ కమిటీ తెలిపింది.

ఇదీ చూడండీ : సూర్య గ్రహణం వేళ ఏం చేయాలి? ఏం చేయకూడదు.?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.