బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు(బి)లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ఎదుట చెరకు రైతులు ధర్నా చేపట్టారు.
కర్మాగారానికి చెరకు తరలించి తొమ్మిది నెలలు గడిచినా బిల్లు చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. జహీరాబాద్ గ్రామీణ పోలీసులు అక్కడికి చేరుకొని అన్నదాతలను శాంతింపజేశారు. నెలాఖరులోగా పూర్తిగా చెల్లించకుంటే... నిరవధిక దీక్షకు దిగుతామనిహెచ్చరించారు.