సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛంద బంద్ పాటించాలని ఆయా గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. కంగ్టి ఉమ్మడి మండలంలోని గారిడేగామలో ఒక కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో తిరిగినట్లు అధికారులు గుర్తించారు.
అతనితో సన్నిహితంగా మెలిగిన ఆయా గ్రామాలకు చెందిన 24 మందిని అధికారులు ఇప్పటికే సంగారెడ్డిలో ఐసోలేషన్ చేశారు. అప్రమత్తమైన కంగ్డి, తడ్కల్ గ్రామస్థులు స్వచ్ఛందంగా పూర్తి బంద్ పాటిస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి తమ గ్రామాన్ని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.