Seashells Collection : కొంతమందికి నాణేలు, కరెన్సీలు సేకరించడం అలవాటు ఉంటుంది. మరికొందరికి ఆర్ట్స్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో దానిపై ఆసక్తి ఉంటుంది. అయితే ఓ వ్యక్తికి మాత్రం శంఖాలు సేకరించడం అలవాటు. ఈ శంఖాలు సేకరించడం అంత ఈజీ ఏం కాదు మరి. వీటికోసం కాస్త సాహసం చేయాల్సిందే. వాటి గురించి తెలుసుకోవాలి..? అవి ఎక్కడ దొరుకుతాయో కనుక్కోవాలి..? అక్కడికి వెళ్లాలి..? వెళ్లినా దొరుకుతాయని చెప్పలేం. శంఖాలు ఎక్కువగా సముద్రాల వద్ద లభిస్తాయి. కాబట్టి కాస్త కష్టమే వాటిని సేకరించడం. కానీ ఈ వ్యక్తి దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నారు. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే అంటూ శంఖాలు కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు. మరి ఈ శంఖాల శాంతారావు స్టోరీ ఏంటో ఓసారి తెలుసుకుందామా..?
Sea Conch Shells Collections : సంగారెడ్డి జిల్లా, గణేష్‌నగర్‌కు చెందిన శాంతారావు అనే విశ్రాంత బ్యాంకు ఉద్యోగి... సముద్ర గర్భంలో దొరికే శంఖాలు, గవ్వలు, ఆల్చిప్పలు ఇలా ఎన్నో అరుదైన వస్తువులను సేకరిస్తున్నాడు. ఇలా సేకరించడం ఎంతో వ్యయప్రాయాసులతో కూడుకున్నా కానీ.. చిన్నప్పటి నుంచీ అలవాటుగా మారిందని చెబుతున్నాడు. ఆస్ర్టేలియా, అమెరికా, న్యూజిలాండ్, టాంజానియా వంటి విదేశాల నుంచి కూడా స్నేహితుల సాయంతో ఎన్నో శంఖాలను తెప్పించానంటున్నారు.
వినూత్నంగా సేకరించాలని : ప్రపంచవ్యాప్తంగా విశేషమైనటువంటి 10 శంఖాలలో ఒకటి తన దగ్గర ఉండటం చాలా సంతోషంగా ఉందని ఆయన చెబుతున్నాడు. ప్రముఖ ఆలయాల్లో తీర్థ, ప్రసాదాల వితరణకు వాడే శంఖాలు సైతం తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నాడు. పరిపక్వత చెంది.. రూపుదిద్దుకోడానికి వందల సంవత్సరాలు పట్టే శంఖాలు కూడా లక్షల రూపాయలతో కొన్నానని చెబుతున్నాడు. వీటిని రాబోయే రోజుల్లో ప్రభుత్వ సహకారంతో మ్యూజియంలో పెట్టాలనే సన్నాహంతో ఉన్నానని తెలిపారు. ఈ పురాతన వస్తువుల సేకరణలో తన కుటుంబం కూడా ఎంతో సహకరించిందని తెలియజేశాడు. తన వృత్తితో సంబంధం లేకుండా ఇటువంటి అబ్బులపరిచే అరుదైన సముద్రపు వస్తువులు, మరెన్నో విదేశీ శంఖాలు సేకరించే పనిలో ఉన్నట్లు ఆయన ఈటీవీ భారత్‌తో చెప్పారు.
"నాకు చిన్నప్పటి నుంచి నాణేలు, కరెన్సీ కలెక్ట్ చేయడం అలవాటు ఉండేది. ఒక సమయంలో అనిపించింది అందరు ఇలా చేస్తారు నేను కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలని. అప్పటి నుంచే శంఖాలను సేకరించడం మొదలు పెట్టాను. ఇండియా సహా ఇతర దేశాల నుంచి శంఖాలు సేకరించడం మొదలు పెట్టాను. అలా నా ప్రయాణం మొదలైంది. ప్రభుత్వం సహకరిస్తే రాబోయే తరాలకు అందించేందుకు ఈ సేకరించిన శంఖాలను నేను మ్యూజియంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను". - శాంతారావు
Singer Chithra Songs : ఒక్క ఛాన్స్‌తో 25వేల సాంగ్స్.. శ్వాస తీసుకోకుండా ఆ పాటతో మ్యాజిక్!