ETV Bharat / state

'ఇక్కడే గొప్ప పదవులు పొంది... పార్టీని చీల్చేందుకు చూస్తున్నారు'

పార్టీ నియమనిబంధనలు ఉల్లంఘించి, కాంగ్రెస్​ను చీల్చేందుకు యత్నిస్తున్న వారు ఎంత పెద్ద వారైనా చర్యలు తీసుకోవాల్సిందేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. 73 సంవత్సరాల వయస్సులో ఆరోగ్యం సహకరించకపోయినా... పార్టీ కోసం ఏఐసీసీ అధ్యక్షురాలుగా అహర్నిశలు కృషి చేస్తున్నారని సోనియాగాంధీని కొనియాడారు.

sangareddy-mla-jagga-reddy-on-aicc
'ఇక్కడే గొప్ప పదవులు పొంది... పార్టీని చీల్చేందుకు చూస్తున్నారు'
author img

By

Published : Aug 24, 2020, 5:12 PM IST

ఏఐసీసీ అధ్యక్షులుగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలో ఎవరో ఒకరు ఉండాలనే కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా ఏఐసీసీ అధ్యక్షులుగా వేరెవరైనా రావాలని కోరుకోవడం లేదని తెలిపారు. 73 సంవత్సరాల వయసులో ఆరోగ్యం సహకరించకపోయినా... సోనియా గాంధీ పార్టీ కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీలో ఉంటూ... అనేక పదవులు పొంది, సీనియర్లుగా ఉండి గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా... గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు.

నెహ్రు ప్రధానిగా ఈ దేశానికి ఎన్నో పారిశ్రామిక, ఆర్ధిక సంస్కరణలు తెచ్చారని... ఆయన హయాంలోనే వ్యవసాయ అభివృద్ధి కోసం భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని జగ్గారెడ్డి తెలిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. దేశ సమగ్రత కోసం వారు ప్రాణత్యాగం చేశారని... ఇలాంటి చరిత్ర ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు.

'ఇక్కడే గొప్ప పదవులు పొంది... పార్టీని చీల్చేందుకు చూస్తున్నారు'

ఇదీ చూడండి: శ్రీశైలం ఘటనపై సీబీఐ విచారణ జరిపించండి: రేవంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.