ETV Bharat / state

Sangareddy Additional Collector CC Suspicious Death : సంగారెడ్డి అదనపు కలెక్టర్ సీసీ అనుమానాస్పద మృతి.. కాలిన స్థితిలో..!

Sangareddy Additional Collector CC Suspicious Death : సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వద్ద సీసీగా పని చేస్తున్న విష్ణువర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంటల్లో కాలిపోయిన విష్ణువర్ధన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో నెల రోజులుగా సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Man Suspicious Death in Sangareddy
Man Suspicious Death
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 1:20 PM IST

Sangareddy Additional Collector CC Suspicious Death : సంగారెడ్డి జిల్లాలో ఓ మిస్టరీ వెలుగు చూసింది. అదనపు కలెక్టర్‌ మాధురి వద్ద సీసీ(Camp Clerk)గా పని చేస్తున్న గడిల విష్ణువర్ధన్‌ (44) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. కొండాపూర్‌ మండలం తెలంగాణ టౌన్‌షిప్‌ వద్ద కాలిన గాయాలతో ఆయన మృతి చెందినట్లు ఇవాళ ఉదయం పోలీసులు గుర్తించారు. కాగా.. శనివారం మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్‌ ఇంటికి వెళ్లనట్లు తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విష్ణువర్ధన్​కు భార్య శివ కృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్‌ (16) ఉన్నారు. రాత్రి సమయంలో భార్య విష్ణువర్ధన్​కు ఫోన్​ చేస్తే మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనారోగ్య కారణాలతో గత నెల రోజులుగా ఆయన సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్‌ వర్గాలు చెబుతున్నాయి. విష్ణువర్ధన్‌ది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా..? దాని కారణంగా విష్ణువర్ధన్ ఆత్మహత్యకు పాల్పడ్డారా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. విష్ణువర్ధన్ మంటల్లో కాలిపోవడం.. అందులోనే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

3 Persons Killed as Tractor Overturns Sangareddy : మంజీరా నదిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌.. ముగ్గురు మృతి

Father and Daughter Died in Train Accident : బాసర అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా రైలు ప్రమాదం.. తండ్రీకూతుళ్ల దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.