సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ బాహ్యవలయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌ఘడ్ నుంచి రాజేంద్రనగర్‌కు కేబుల్ వైరు లోడు తీసుకెళ్తున్న లారీ సుల్తాన్‌పుర్ వద్ద టైరు పంచర్ అయింది. టైరు మారుస్తున్న లారీ క్లీనర్ అమన్‌కుమార్, సయ్యద్ సల్మాన్‌లను వెనుకనుంచి మరో లారీ వచ్చి ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.