జల, వాయు కాలుష్యం బెడద తట్టుకోలేక పోతున్నామని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు చుట్టుపక్కల కాలనీవాసులు రామచంద్రపురం పీసీబీ జోనల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధి శంతన్ హోమ్, నవ్య లక్ష్మి వ్యూ, నరేంద్ర నగర్, పీఎన్ఆర్ కాలనీ, దుర్గ హోమ్స్, శంతన్ గ్రీన్ పార్క్, ప్రణీత్ ప్రణవ్, పనోరమా యాక్సిస్, పాపా హోమ్స్‌తో పాటు దాదాపు పది కాలనీ వాసులు ఆరు నెలలుగా కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
తాజాగా ఆదివారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కాలుష్యం బెడద తట్టుకోలేక కాలనీవాసులు ఇతర కాలనీలకు వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీబీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పినా ఫలితం లేదన్నారు. కాలనీల్లో కొన్నిచోట్ల బోర్లు వేస్తే కాలుష్య జలాలు వస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జల, వాయు కాలుష్యాల బెడద నివారించాలని కోరారు.
ఇదీ చదవండిః హైదరాబాద్‌ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..