ఇంట్లో ఆశ్రయం ఇస్తానని తీసుకెళ్లి వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టడంతో బాధితురాలు... పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వనపర్తికి చెందిన ఓ కుటుంబం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామానికి బతుకుదెరువు నిమిత్తం వచ్చింది. అక్కడే ఓ ఇల్లును అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ కుటుంబంలో 62 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉంది. ఆ వృద్ధురాలిని ఇంటివద్ద ఉంచి కుటుంబసభ్యులు పనులకు వెళ్లేవారు.
అందరూ పనులకు వెళ్లగా... ఇంటికి సమీపంలో ఉన్న కొండయ్య అనే వ్యక్తి ఆ వృద్ధురాలిని తన ఇంటికి పిలిచి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై బీడీఎల్ భానూరు పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: పెళ్లికి వెళ్లి వచ్చేసరికే ఇంటిని దోచేశారు!