సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతి(కే) శివారులోని చెరుకు తోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పది రోజుల క్రితమే వృద్ధుడు చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నందున... అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: అన్నదాతల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో తెలంగాణ