బడుగు బలహీన వర్గాల ప్రజలకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుదని నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామస్థులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, రైతు బంధు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
రాష్ట్రంలోని ఆడ పిల్లల భాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. అందుకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. మొత్తం రూ. 1.78 కోట్ల మేర చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: శాస్త్రవేత్తలు, వాలంటీర్లకు ఈ విజయం అంకితం: భారత్ బయోటెక్ సీఎండీ