ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీ కొత్తకొండ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొవిడ్ వార్డును సందర్శించిన ఆయన అక్కడి రోగులతో స్వయంగా మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
కొవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆసుపత్రిలోని వైద్యులతో చర్చించిన ఆయన మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రోగుల సంఖ్య పెరిగినా.. వైద్యం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బాలల సహాయవాణి వాహనాన్ని ప్రారంభించిన మంత్రి