సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని సేవా ఆశ్రమంలో రాష్ట్ర యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలోని మాతృమూర్తులను రాష్ట్ర యువజన సంఘాల సమితి కార్యదర్శి ఉదయ్ కుమార్ శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. మాతృమూర్తులను తన తల్లులుగా భావించి సేవలందిస్తున్న ఆశ్రమ నిర్వాహకురాలు లక్ష్మిని ప్రత్యేకంగా సత్కరించారు. పిల్లలు పెద్దవారైన తర్వాత నవ మాసాలు మోసి పెంచిన తల్లిని మరవొద్దని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ఇవీ చూడండి: నల్లగొండ ఎమ్మెల్సీ పోరుకు సిద్ధమవుతున్న పార్టీలు