మొదటి విడత పల్లె ప్రగతిలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తిని రెండో విడతలో కొనసాగించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో కొత్త సర్పంచులకు 90% మంచి పేరు వచ్చిందని.. అందివచ్చిన అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నారని అభినందించారు.
పనులకు సంబంధించి చెల్లించే బిల్లులకు నిధుల కొరత లేదని, సంబంధిత పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించాలని కోరారు. చాలా మంది పిల్లలు బడికి వెళ్లకుండా పనులకు వెళ్తున్నారని.. దీనిపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.
జిల్లాలో త్వరలోనే తడి, పొడి చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమం చేపడతామని.. ఏ ఒక్క గ్రామంలో చెత్త కనపడకుండా చేయడమే ఈ రెండో విడత పల్లె ప్రగతి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
- ఇవీ చూడండి: 'ఇలా చదువు చెప్తే పిల్లలు ఎలా పోటీనిస్తారు?'