ETV Bharat / state

అభివృద్ధి చేసేవాళ్లు కావాలా.. బాంబులు వేసేవాళ్లు కావాలా?

అభివృద్ధి చేసే వాళ్లు కావాలో.. బాంబులు వేసి కూలగొట్టే వాళ్లు కావాలో నిర్ణయించుకోవాలని ఓటర్లకు మంత్రి హరీశ్ రావు సూచించారు. భాజపా మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శించారు. పటాన్ చెరు డివిజన్​లో తెరాస అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.

harish rao
harish rao
author img

By

Published : Nov 28, 2020, 10:52 AM IST

భాజపా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోంటే.. తెరాస ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి కాపాడుతోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. పటాన్ చెరు డివిజన్​లో తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ర్యాలీలు, కాలనీ వాసులు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. అభివృద్ధి చేసే వాళ్లు కావాలో.. బాంబులు వేసి కూలగొట్టే వాళ్లు కావాలో నిర్ణయించుకోవాలని ఓటర్లకు హరీశ్ రావు సూచించారు.

భాజపా మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతోందని మంత్రి విమర్శించారు. కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తుంటే.. భాజపా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అంటోందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రశాంత వాతవరణం ఉంటేనే పెట్టుబడులు వచ్చి హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు. ప్రశాంత హైదరాబాద్ కోసం కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధి చేసేవాళ్లు కావాలా.. బాంబులు వేసేవాళ్లు కావాలా?

ఇదీ చదవండి : బల్దియా పోరు: గల్లీల నిండా జిల్లాల నాయకులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.