ETV Bharat / state

శానిటైజ్ చేశారా..? బియ్యం వచ్చాయా..? తాళాలెక్కడ..?: హరీశ్ - అందోలు గురుకుల పాఠశాల సిబ్బందిపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

రేపటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నందున... సంగారెడ్డి జిల్లా అందోలు సాంఘిక సంక్షేం గురుకుల బాలికల పాఠశాలను మంత్రి హరీశ్ రావు తనిఖీ చేశారు. తరగతి, వసతి గృహం గదులు పరిశీలిస్తానని అడగ్గా... తాళాలు లేవని సిబ్బంది సమాధానం చెప్పారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

minister harish rao fire on adole residential school staff
శానిటైజ్ చేశారా..? బియ్యం వచ్చాయా..? తాళాలెక్కడ..?: హరీశ్
author img

By

Published : Jan 31, 2021, 11:11 PM IST

సంగారెడ్డి జిల్లా అందోలు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేపటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు వసతి గృహం వద్దకు వెళ్లగా తాళాలు లేవని సిబ్బంది చెప్పారు. అంతేకాకుండా... ప్రిన్సిపల్, కేర్ ​టేకర్, అసిస్టెంట్ కేర్​ టేకర్, వంట మనుషులు లేకపోవడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయం గురించి తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్​కు ఫోన్​ చేసి వివరించారు. సిబ్బందికి తగిన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. పలుమార్లు జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించి చెప్పినప్పటికీ... ఇలా వ్యవహరించడం కరెక్టు కాదని హితవు పలికారు. ఈ రాత్రికి ఎవరైనా విద్యార్థులు వస్తే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి వెంట జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీ ఛైర్​పర్సన్​ మంజు శ్రీ, తదితరులు ఉన్నారు.

శానిటైజ్ చేశారా..? బియ్యం వచ్చాయా..? తాళాలెక్కడ..?: హరీశ్
ఇదీ చూడండి: తెలంగాణలో మహిళలకే అధిక ప్రాధాన్యం: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.