సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని కంగ్టి మండల కేంద్రంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. పనులు జరిగే చోట కూలీలు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
అందులో భాగంగా మండలంలో ఉన్న 900 మంది కూలీలను 32 గ్రూపులుగా విభజన చేశారు. ప్రస్తుతం స్థానిక సర్పంచ్ పూజ, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య నేతృత్వంలో పది గ్రూపులకు చెందిన సుమారు 300 మంది కూలీలు పనులు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా రోగికి 'ప్రైవేటు' వైద్యం.. ఏపీలో ఘటన