సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఖాన్జమాల్పూర్లో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామ శివారులో పశువుల కోసం తాగునీటి తొట్టి నిర్మిస్తుండగా సాయంత్రం వేళ వర్షం రావడం వల్ల నలుగురు చెట్టు నీడకు వెళ్లారు. అంతలోనే భారీ శబ్ధంతో పిడుగు పడింది. భవన నిర్మాణ కార్మికుడు ఆశప్ప అక్కడికక్కడే మృతి మృతిచెందాడు. గాయపడిన సంతోష్, తుకారాం, నర్సింహులును జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని రాయికోడ్ ఎస్ఐ గోపి సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: కడిపికొండలో మళ్లీ విషాదం.. కుళ్లిన 6 మృతదేహాలు లభ్యం