ETV Bharat / state

కడిపికొండలో మళ్లీ విషాదం నింపిన బోటు ప్రమాదం

ఏపీ గోదావరి నది ప్రమాద ఘటన ఎంతోమంది కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది. ప్రమాదానికి గురైన బోటు వెలికితీయడం వల్ల వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి.

కడిపికొండలో మళ్లీ విషాదం.. కుళ్లిన 6 మృతదేహాలు లభ్యం
author img

By

Published : Oct 22, 2019, 9:48 PM IST

Updated : Oct 22, 2019, 11:32 PM IST

ఆంధ్రప్రదేశ్​ తూ.గో జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీయడం వల్ల వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామం నుంచి పాపికొండల విహార యాత్రకు 14 మంది గ్రామస్తులు వెళ్లగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. బోటులో చిక్కుకొని 9మంది మృతి చెందగా... వారిలో 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. కొమ్ముల రవి, బస్కె ధర్మరాజు, కొండూరి రాజ్ కుమార్ మృతదేహాలు ఇప్పటికి దొరకలేదు. బోటును ఇవాళ బయటకు తీసిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ వారిని చివరిచూపు చూసుకునే భాగ్యమైనా దక్కాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారుల నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని వారు తెలిపారు.

కడిపికొండలో మళ్లీ విషాదం.. కుళ్లిన 6 మృతదేహాలు లభ్యం

ఈరోజు లభించిన మృతదేహాలు పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉన్నందున గుర్తు పట్టడం కోసం రేపు రాజమండ్రి వెళుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి చాలామంది నాయకులు తమను ఓదార్చడానికి వచ్చినా.. మృతుల కుటుంబాలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నష్టపరిహారాన్ని అందించే విషయంలో మాత్రం ఎవరూ చొరవ చూపడం లేదని వారు వాపోయారు.

ఇదీ చూడండి:రేప్​ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్​మెంట్​ థియరీ'

Intro:TG_WGL_12_22_MRUTHA_DEHAALA_KOSAM_EDURU_CHUPU_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీయడంతో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో మరోసారి విషాద చాయలు అలుముకున్నాయి. ఈ గ్రామం నుంచి పాపికొండలు విహార యాత్రకు 14 మంది గ్రామస్తులు వెళ్లగా.... ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో చిక్కుకొని 9మంది మృతి చెందగా... వారిలో 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. కొమ్ముల రవి, బస్కె ధర్మరాజు, కొండూరి రాజ్ కుమార్ మృతదేహాలు ఇప్పటికి దొరకలేదు. బోటును ఈరోజు బయటకు తీసిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ వారిని చివరిచూపు చూసుకునే భాగ్యమైన దక్కాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారుల నుండి తమకు ఎటువంటి సమాచారం అందలేదని వారు తెలిపారు. ఈరోజు లభించిన మృతదేహాలు పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండడంతో గుర్తు పట్టడం కోసం రేపు రాజమండ్రి వెళుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు నుండి చాలామంది నాయకులు తమను ఓదార్చడానికి వచ్చారని.... కానీ మృతుల కుటుంబాలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నష్టపరిహారాన్ని అందించే విషయంలో మాత్రం ఎవరు చొరవ చూపడం లేదని వారు వాపోయారు.

byte...

పుష్ప, కొమ్ముల రవి భార్య.
రాజు, కుటుంబ సభ్యుడు.
వెన్నెల, బస్కె ధర్మరాజు కూతురు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
Last Updated : Oct 22, 2019, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.