ETV Bharat / state

konda vishweshwar reddy: తెరాస పాలనలో వారంతా బానిసలే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి - ఎమ్మెల్యేలు, మంత్రులపై కొండా విమర్శలు

తెరాస ఎమ్మెల్యేలను ఎవరూ తప్పుపట్టొద్దని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంత్రులందరూ కూడా జై కేసీఆర్ అనాల్సిందేనని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగ సాధన దీక్షలో ఆయన పాల్గొన్నారు.

konda vishweshwar reddy
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
author img

By

Published : Sep 23, 2021, 6:43 PM IST

తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు తెరాస పాలనలో బానిసలేనని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగ సాధన దీక్షలో కోదండరాంతో కలిసి ఆయన పాల్గొన్నారు. మీ నియోజకవర్గాల్లో సమస్యలుంటే ఎమ్మెల్యేలను తప్పు పట్టవద్దని వ్యంగ్యంగా మాట్లాడారు.

నియోజకవర్గ సమస్యలు, ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్​తో మాట్లాడే ధైర్యం ఏ ఒక్క ఎమ్మెల్యేకు, మంత్రికి లేదని విమర్శించారు. బానిసలుగా ఉండకుంటే వారి పతనం చూసే వరకు సీఎం నిద్రపోరని అన్నారు. స్థానిక జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గురించి తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తెరాస ఎమ్మెల్యేలను, మంత్రులను తప్పుపట్టకండి. తెరాస పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అందరూ బానిసలే. తెరాస నాయకులందరూ జై కేసీఆర్ అనే వాళ్లే. స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావును ఏమనకండి. లేకపోతే మనం కూడా వాళ్లలాగా మొన్న ఒకాయన మాట్లాడిన విధంగా తొడకొట్టి సవాల్ విసరాలే. ఆ విధంగా మనం కూడా భాష మాట్లాడాలే. - కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు

ఇదీ చూడండి: Konda on white challenge: బండి సంజయ్, ప్రవీణ్ కుమార్​కు వైట్ ఛాలెంజ్ విసురుతున్నా: కొండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.