ETV Bharat / state

ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగిన నామినేషన్లు

ఉమ్మడి మెదక్​ జిల్లాలో బుధవారం పురపాలక నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మున్సిపల్​ కార్యాలయాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నామినేషన్​ వేసే అభ్యర్థి వెంట కేవలం ఐదుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 165 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో సంగారెడ్డి జిల్లాలో గరిష్ఠంగా 91 నామినేషన్లు దాఖలవగా.. కనిష్ఠంగా సిద్దిపేట జిల్లాలో 32 నామినేషన్లు దాఖలయ్యాయి.

Joint Medak District-wide nominations Stretched down
ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగిన నామినేషన్లు
author img

By

Published : Jan 9, 2020, 12:25 PM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ వి. నాగిరెడ్డి మంగళవారం పురపాలక ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల చేయడంతో బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి రోజు నామినేషన్లు జోరుగా సాగాయి.

మెదక్​ జిల్లాలో మొత్తం నాలుగు పురపాలక సంఘాలు ఉండగా.. మొదటి రోజు 42 నామినేషన్లు దాఖలయ్యాయి. గరిష్ఠంగా నర్సాపూర్​లో 21, కనిష్ఠంగా రామాయంపేటలో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా పట్టణాల వారీగా.. మెదక్​లో 14, రామాయంపేటలో 2, నర్సాపూర్​లో 21, తూప్రాన్​లో 5 నామినేషన్లు దాఖలయ్యాయి.

సిద్దిపేటలో...

సిద్దిపేట జిల్లాలో మొత్తం 5 పురపాలక సంఘాలు ఉండగా.. సిద్దిపేట పాలక మండలి గడువు ఉండటం వల్ల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మిగిలిన నాలుగు పట్టణాల్లో మొదటి రోజు 32 నామినేషన్లు దాఖలు చేశారు. గరిష్ఠంగా హుస్నాబాద్​లో 17, కనిష్ఠంగా గజ్వేల్​లో 3 నామినేషన్లు వేశారు. ఆయా పట్టణాల వారీగా.. హుస్నాబాద్​లో 17, చేర్యాలలో 4, దుబ్బాకలో 8, గజ్వేల్​లో 3 నామినేషన్లు దాఖలయ్యాయి.

సంగారెడ్డిలో..

సంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 పురపాలక సంఘాలు ఉండగా.. కోర్టులో కేసు ఉండటం వల్ల జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. మిగిలిన 7 పట్టణాల్లో మొదటి రోజు మొత్తం 91 నామినేషన్లు దాఖలు చేశారు. గరిష్ఠంగా సంగారెడ్డిలో 27, కనిష్ఠంగా నారాయణఖేడ్​లో 1 నామినేషన్ వేశారు. ఆయా పట్టణాల వారీగా.. అమీన్​పూర్​లో 20, ఐడీఏ బొల్లారంలో 9, తెల్లాపూర్​లో 4, సంగారెడ్డిలో 27, సదాశివపేటలో 20, ఆందోల్-జోగిపేటలో 10, నారాయణఖేడ్​లో 1 నామినేషన్ దాఖలయ్యాయి.

ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగిన నామినేషన్లు

ఇదీ చూడండి : 'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి'

Intro:tg_srd_16_08_attn_muncipal_naminations_gajwel_av_ts10054
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగింది మొదటిరోజు 3 నామినేషన్లు దాఖలయ్యాయిBody:సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ స్థానిక సమీకృత కార్యాలయ భవనంలో మూడు వార్డులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేసి నామినేషన్లను స్వీకరించారు నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అధికారులు పోలీసులు ముందస్తు చర్యలు ఏర్పాటు చేశారు తొలిరోజు 20వ వార్డు నుంచి తెరాస పట్టణ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి రెండవ వార్డు నుంచి ఆయన సతీమణి ఉమారెడ్డి పదో వార్డు నుంచి బిజెపి నుంచి తూము శ్రీధర్ నామినేషన్లు దాఖలు చేశారు తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారి హరిచందన పరిశీలించారుConclusion:బైట్ హరిచందన జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.