ETV Bharat / entertainment

'కంగువా' కోసం దిశా భారీ రెమ్యూనరేషన్! - చిన్న పాత్ర కోసం ఆమె ఎంత తీసుకున్నారంటే? - DISHA PATANI KANGUVA REMUNERATION

'కంగువా' సినిమా కోసం దిశాకు మేకర్స్ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారంటే?

Disha Patani Kanguva Remuneration
Disha Patani (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2024, 7:17 PM IST

Disha Patani Kanguva Remuneration : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య - డైరెక్టర్ శివ కాంబినేషన్​లో తెరకెక్కిన తాజా మూవీ 'కంగువా' భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం మిక్స్​డ్ టాక్​తో థియేటర్లలో రన్ అవుతోంది. అయితే ఈ సినిమా మాత్రం పలు అంశాల కారణంగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అందులో ఈ చిత్ర నటీనటుల రెమ్యూనరేషన్ ఒకటి.

ముఖ్యంగా ఇందులో ఫీమల్​ లీడ్​గా మెరిసిన దిశా పటానీ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దిశాకు మేకర్స్ రూ. 5 కోట్ల పారితోషకాన్ని ఇచ్చారట. అయితే ఇది ఆమె ఇప్పటి వరకూ అందుకున్న రెమ్యూనరేషన్లలో అత్యథికమైనది కావడం విశేషం. అయితే ఈ సినిమాలో దిశాకు అంతగా ప్రాధాన్యత ఉన్న సీన్స్ లేకపోవడం అలాగే తన రోల్​ కూడా తక్కువ నిడివితోనే ఉండటం గమనార్హం. దీంతో ఫ్యాన్స్ కూడా ఆమెకు ఎందుకంటే రెమ్యూనేరషన్ ముట్టజెప్పారంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు ఈ సినిమా కోసం హీరో సూర్య సుమారు రూ.39 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారట. అయితే ఆయన గత కొంత కాలంగా ఒక్క సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల పారితోషకం అందుకున్నారట. కానీ ఈ సినిమాకు మాత్రం తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో మెరిసిన బాలీవుడ్ స్టార్ బాబీ దేఓల్ సుమారు రూ. 5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంద.

'కంగువా' స్టోరీ ఏంటంటే?
ఫ్రాన్సిస్ (సూర్య‌) గోవాలో ఓ బౌంటీ హంట‌ర్‌. పోలీసులు కూడా చేయ‌లేని ప‌నులను చేసి దానికి వాళ్ల నుంచి డ‌బ్బు తీసుకుంటుంటాడు. ఏంజెలా (దిశా ప‌టానీ)దీ కూడా ఇదే ప‌ని. ఒక‌ప్పుడు ఈ ఇద్దరూ లవర్సే. కానీ ఆ త‌ర్వాత విడిపోయి ఎవ‌రి దారులు వాళ్లు చూసుకుంటారు. అయితే ఫ్రాన్సిస్, త‌న స్నేహితుడు (యోగిబాబు)తో క‌లిసి ఓ బౌంటీ హంటింగ్ ప‌నిపై ఉన్న‌ సమయంలోనే జీటా అనే ఓ చిన్నారిని క‌లుసుకుంటారు. అతడ్ని క‌లుసుకోగానే ఈ ఇద్ద‌రికీ ఏదో తెలియ‌ని సంబంధం ఉన్న భావ‌న క‌లుగుతుంది ఫ్రాన్సిస్‌కు. అయితే ఒక సమయంలో ఆ బాలుడి ప్రాణాల‌కి ప్ర‌మాదం ఉంద‌ని తెలుసుకున్న ఫ్రాన్సిస్ ఆ చిన్నారిని కాపాడేందుకు ఎటువంటి సాహ‌సాలు చేశాడు? అస‌లు ఈ జీటాని వెంటాడుతున్నది ఎవ‌రు? జీటా, ఫ్రాన్సిస్‌, 1070 సంవ‌త్స‌రాల నాటి ప్ర‌ణవకోన యువ‌రాజు కంగువా (సూర్య‌)కి మ‌ధ్య సంబంధం ఏంటి? ఇటువంటి విష‌యాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

'కంగువా' డైరెక్టర్​ శివ నెక్ట్స్​ సినిమా - ఆ స్టార్​ హీరోతోనే!

'కంగువా 2'లో దీపికా పదుకొణె? - నిర్మాత సమాధానమిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.