సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మారుతీ అనాథాశ్రమంలో బాలిక అత్యాచార కేసు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా పరిధిలోని జైలులో ఉన్న నిందితులకు పోలీసులు పటాన్చెరు ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం మారుతీ అనాథాశ్రమానికి వారిని రెండు వాహనాల్లో తీసుకెళ్లారు.
దాదాపు మూడు గంటలకుపైగా అనాథాశ్రమంలోనే నిందితులను పోలీసులు విచారించారు. ఆ రహదారి గుండా మీడియా రాకుండా కొంతదూరం ముందుగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి : అనాథ ఆశ్రమంలో బాలిక మృతిపై అధికారుల విచారణ