ప్రజాప్రతినిధులు హరిత సంరక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జహీరాబాద్ ఎంపీపీ గిరిధర్ రెడ్డి కోరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో హరితహారం మొక్కల సంరక్షణ, నర్సరీల పెంపకంలో ఆదర్శంగా నిలిచిన సర్పంచులు, వన సేవకులను పూలమాల, శాలువాతో సన్మానించారు. పల్లె ప్రగతి లక్ష్యాలను అందిపుచ్చుకొని గ్రామాల్లో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ఈ సమావేశంలో ఎంపీడీవో రాములు సర్పంచులకు సూచించారు. అద్వితీయ ప్రతిభతో పొరుగు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచులకు సన్మానం చేయడం జరిగిందని, వచ్చే సర్వసభ్య సమావేశంలో పనితీరు ఆధారంగా మరింతమందికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
హరిత సంరక్షకులకు సన్మానం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో హరితహారం మొక్కల సంరక్షణ, నర్సరీల పెంపకంలో ఆదర్శంగా నిలిచిన సర్పంచులు, వనసేవకులను అధికారులు సన్మానించారు. ప్రజా ప్రతినిధులు హరిత సంరక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.