సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఫలితంగా జిల్లాలో అన్ని ప్రాంతాల కంటే పటాన్చెరు మండలంలోనే అత్యధికంగా 38.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏకధాటిగా కురిసిన వానలకు అత్యధిక వర్షపాతం నమోదైంది. పటాన్చెరులో 38.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా... జిన్నారం మండలంలో 35.6 మిల్లీమీటర్ల మేర వాన కురిసింది. రామచంద్రపురంలోనూ 31.2 మిల్లీమీటర్ల వర్షం కురిసి మూడో స్థానంలో నిలిచింది.
రాత్రి నుంచి ఏకధాటిగా...
రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఎప్పటి నుంచో నీరు అందని కాలువలు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ శివారులో ఉన్న కత్వ కాల్వ ద్వారా నీరు చెరువులోకి చేరుతుంది. గత ఐదేళ్లుగా నిండని ఈ కాల్వ ప్రస్తుతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా స్థానికులు హర్షం వ్యక్త చేస్తున్నారు. పూజా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి : నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్