ETV Bharat / state

పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అందరూ కృషి చేయాలి: మేయర్

ప్రజలు చెత్తను రోడ్డు మీద వేయకుండా తమ ఇళ్లవద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇవ్వాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్​ పరిధిలో పర్యటించిన ఆమె స్థానిక కార్పొరేటర్​తో కలిసి చెత్త బదిలీ కేంద్రం​, మార్కెట్ యార్డ్​ను పరిశీలించారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అందరూ తమ వంతు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ghmc mayor visit patancheru divison
పటాన్​చెరు డివిజన్​లో పర్యటించిన జీహెచ్ఎంసీ మేయర్
author img

By

Published : Apr 23, 2021, 4:17 PM IST

పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా సహకరించాలని జీహెచ్​ఎంసీ మేయర్ విజయలక్ష్మి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్​లో చేపట్టిన శానిటేషన్ డ్రైవ్​లో భాగంగా స్థానిక కార్పొరేటర్​తో కలిసి చెత్త బదిలీ కేంద్రం, మార్కెట్​ యార్డ్​లను ఆమె పరిశీలించారు.

ప్రజలు చెత్తను తమ ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇవ్వాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. శానిటేషన్ విభాగంలో ఎస్ఎఫ్ఏల ద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. చెత్త బదిలీ కేంద్రం​ వద్ద గల కార్మికులకు మధ్యాహ్నం భోజనం, వేచి ఉండేందుకు షెడ్డు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైట్ రసాయనాన్ని చల్లేలా చూస్తామని ఆమె చెప్పారు. త్వరలోనే బండ్లగూడలో మరో చెత్త బదిలీ కేంద్రాన్ని​ ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కొవిడ్​ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.