సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్ర కాలనీలో పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ భారీ మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతుందని విగ్రహం ప్రతిష్టించిన చోటే షవర్లు ఏర్పాటు చేసి నీటిని పిచికారీ చేస్తూ పూర్తిగా కరిగిపోయేలా చూశారు. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పట్టణ ప్రజలు ఆసక్తిగా తరలివచ్చారు.
ఇదీ చూడండి: బై బై గణేశా... నగరంలో నిమజ్జనాలు షురూ