పొరుగు రాష్ట్రాల నుంచి కూడా...
జిల్లావాసులే కాక... చుట్టూ పక్కల రాష్ట్రాల మామిడి ప్రియులు కూడా వచ్చి ఇక్కడి నుంచి పండ్లు తీసుకెళ్తుంటారు. ప్రియమైన వారికి బహుమతులుగా కూడా ఇస్తుంటారు. తమకిష్టమైన రకాలను తీసుకెళ్లటానికి నగరాల నుంచి ఏటా వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు.
అరుదైన రకాలు...
అత్యంత అరుదైన ఫలరాజు రకాలు ఇక్కడ లభిస్తాయని.. నిర్వాహకులు చెబుతున్నారు. ఫల పరిశోధన కేంద్రంలో కాసే ప్రతీ పండు ఇక్కడే విక్రయిస్తారు. ఇక్కడ కాయలను మాగబెట్టే విధానంపై ఫల పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తల పర్యవేక్షణ ఉంటుంది. ఈ సంవత్సరం నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో దిగుబడి కొద్దిగా తగ్గిందని దుకాణదారులు తెలిపారు.
ధరలు పెరిగాయి...
దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్న ఇక్కడి పండ్లకు ఈసారి ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని వినియోగదారులు అంటున్నారు. అయినా సరే... స్వచ్ఛమైన మామిడి పండ్ల రుచి చూడాలంటే తప్పదని మరికొందరంటున్నారు. అయితే ఆలస్యమేందుకు... మామిడి పండ్ల మాధుర్యాన్ని ఆస్వాధించేందుకు మీరూ సంగారెడ్డికి వచ్చేయండి.
ఇవీ చూడండి: అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం