ETV Bharat / state

'దోచుకున్న సొమ్ముతో.. కేసీఆర్ 2వేల ఎకరాలు కొన్నాడు' - GHMC Election Information

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్​లో భాజపా అభ్యర్థి ఆశిష్​ గౌడ్​కు మద్దతుగా అంబేడ్కర్​ కాలనీలో ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ వివేక్​ పాల్గొన్నారు. దోచుకున్న సొమ్ముతో కేసీఆర్​.. 2 వేల ఎకరాలు గచ్చిబౌలిలో కొనుకున్నారని ఆరోపించారు.

Former MP Vivek
'కేసీఆర్..​ దోచుకున్న సొమ్ముతో 2వేల ఎకరాలు గచ్చిబౌలిలో కొన్నాడు'
author img

By

Published : Nov 25, 2020, 5:43 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి.. కమీషన్లతో ఆస్తులు కూడబెడుతున్నారని మాజీ ఎంపీ వివేక్​ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్​లో భాజపా అభ్యర్థి ఆశిష్​ గౌడ్​కు మద్దతుగా అంబేడ్కర్​ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓసారి మాయమాటలు చెప్పి.. ఓట్లు వేయించుకున్నారు... మళ్లీ వేస్తే మోసపోతామని తెలిపారు.

రెండు పడకగదుల ఇళ్లు ఇస్తామని చెప్పి... ఇవ్వలేదు కానీ.. వంద ఎకరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఫాంహౌస్ కట్టుకున్నారని... ఆయన కొడుక్కి, బిడ్డకు కూడా ఫాంహౌస్​లు నిర్మించుకున్నారని మండిపడ్డారు. దోచుకున్న సొమ్ముతో 2 వేల ఎకరాలు గచ్చిబౌలిలో కొనుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా మాత్రం ఖాళీ చేశారని ధ్వజమెత్తారు. డబ్బులు కోసం ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చారని విరుచుకుపడ్డారు.

అవినీతి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఎన్నికల ఇంఛార్జ్​ పొంగులేటి సుధాకర్​ ఆరోపించారు. భాజపా అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో ఓటువేసి గెలిపించాలని కోరారు. వరద బాధితులను వరదలో ముంచి తెరాస నాయకులు దండుకున్నారని విమర్శించారు. ప్రజలు తెరాసకు ఓటు అనే ఆయుధంతో కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు. తెరాసకు ఓటువేస్తే ఎంఐఎంకు ఓటువేసినట్లే అని చెప్పారు. ఇళ్లు కావాలన్నా, వరద సహాయం కావాలన్నా భాజపాను గెలిపించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.