సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ఎదురుగూడెంలో శారద సెల్‌టెక్ రబ్బరు పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. రబ్బరు పరిశ్రమకి వినియోగించే ఆయిల్ ట్యాంక్ ఓవర్‌లోడ్ కావడం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అగ్నిప్రమాదంలో రబ్బరు పదార్థాలు దగ్ధం కావటం వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇవీ చూడండి: బోధన్‌లో ఘనంగా ఐదోరోజు అగ్నిమాపక వారోత్సవాలు