ETV Bharat / state

మొక్కజొన్న సాగు వద్దని రైతులకు అవగాహన కల్పించండి: హరీశ్ - కేంద్రం నిర్ణయంపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

మొక్కజొన్న సాగు, దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆర్థిఖశాఖ మంత్రి హరీశ్​ రావు ఆవేధన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో రైతులకు ఇబ్బందులు తప్పాయన్నారు.

finance minister harish rao express consciousness on central decision
మొక్కజొన్న సాగుపై రైతులకు అవగాహన కల్పించండి: హరీశ్
author img

By

Published : Oct 12, 2020, 7:47 PM IST

మొక్కజొన్నల దిగుమతిపై కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా 'పంటల సాగు-కొనుగోళ్ల కార్యచరణ సమవేశానికి' ముఖ్యఅతిథిగా హాజరై అవగాహన కల్పించారు. దేశంలో 2.4కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న అవసరం ఉండగా... ఇప్పటికే గోదాముల్లో 3.52కోట్ల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయన్నారు. దీనికి తోడు దేశ వ్యాప్తంగా 2.04కోట్ల ఎకరాల్లో తాజాగా సాగు చేశారని... ఈ దిగుబడి అక్టోబర్​లో వస్తుందన్నారు. డిమాండ్ లేకపోవడం వల్ల గతేడాది బిహార్, ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వాలు కొనుగోలు చేయలేదన్నారు.

మొక్కజొన్న సాగుపై రైతులకు అవగాహన కల్పించండి: హరీశ్

విదేశాల నుంచి దిగుమతిపై ఉన్న నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసి, 50శాతం ఉన్న సుంకాన్ని 15 శాతానికి తగ్గించినందున... రైతులపై ప్రతికూల ప్రభావం చూపనుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో వానాకాలంలో ఈ పంట సాగును నియంత్రించడం వల్ల ఇబ్బందులు తప్పాయని పేర్కొన్నారు. యాసంగిలోనూ రైతులు మొక్కజొన్న సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి: పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న ప్రేమికులు.. కానీ ఇంతలోనే..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.