లాక్డౌన్ సమయంలో మందు కల్లు విక్రయిస్తున్న, మద్యం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అబ్కారీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం గండిగూడ కాలనీలో యాదగిరి, లింగమయ్య కాలనీలో అర్జున్ గౌడ్, బీరంగూడలో సూర్య ప్రకాష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు కల్లు విక్రయిస్తుండటంతో అబ్కారీ అధికారులు దాడులు చేసి విక్రయిస్తున్న 150 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. వారి ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
జిన్నారం మండలం కొడకంచి గ్రామ శివారులోనూ కారులో అదే గ్రామానికి చెందిన జగన్ గౌడ్, జానకంపేటకు చెందిన గణేష్ గౌడ్లు మద్యం తరలిస్తుండగా అబ్కారీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 26 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కారు జప్తుచేసి వారిపై కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: లాక్డౌన్లో రోడ్డుమీదకొస్తే.. వాహనం సీజ్